జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » హన్మకొండలో దారుణం: బాలుడి గొంతు కోసిన టీచర్! (Nalgonda | Hanumakonda | Boy | Teacher | Throat)
Bookmark and Share Feedback Print
 
నల్గొండ జిల్లాలోని హన్మకొండలో మరో దారుణం జరిగింది. చిన్నారుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే యముడిగా మారాడు. సభ్య సమాజం తలదించుకునేలా పది సంవత్సరాల బాలుడి గొంతు కోసి పారిపోయాడు. స్థానికంగా ఒక తండాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నాగరాజు అనే టీచర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

హన్మకొండకు చెందిన పదేళ్ళ ఉదయ కిరణ్ అనే బాలుడిని నాగరాజు అనే టీచర్ మంగళవారం గొంతు కోశాడు. దీంతో ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఉదయ్ కిరణ్ తల్లి మాట్లాడుతూ.. తన భర్త స్నేహితుడైన నాగరాజు ఈ దురాగతానికి ఒడిగట్టినట్టు చెప్పారు.

భర్త లేని సమయంలో నాగరాజు ఇంటికి వచ్చారన్నారు. ఆయన లేరని చెప్పగా, ఆయన వచ్చేంత వరకు వేచి చూస్తానని చెప్పడంతో నాగరాజుకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. తాను పడకగదిలోకి వెళ్లి పేపరు చదువుతుండగా, నాగరాజు ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు.

తనకు అనుమానం వచ్చి చూడగా, బిడ్డ గొంతు నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించి, నాగరాజును పట్టుకునేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. తన నుంచి తప్పించుకునేందుకు తనపై కూడా దాడి చేసి పరారయ్యాడని ఆమె వివరించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.