జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్-సోనియా ఫోటోలకు మొక్కండి: శైలజానాథ్ (YS | Sonia Gandhi | Sailajanath | Hyd | TDP | CLP office)
Bookmark and Share Feedback Print
 
File
FILE
ప్రజలకు మంచి చేయాలనే మంచి బుద్ధి, తపన రావాలంటే తెలుగుదేశం పార్టీ నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల ఫోటోలకు పూజలు చేసి, మొక్కాలని ప్రభుత్వ విఫ్ విప్ శైలజానాథ్ సూచన చేశారు. ఇలా చేయడం వల్ల వారికి జ్ఞానోదయం కలుగుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య సర్కారును అస్థిర పరిచేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. మంత్రుల బోర్డులకు టూలెట్ బోర్డులు పెడతామని తెదేపా నేతలు చేస్తున్న ప్రకటనలు ఆయన ఖండించారు.

ఇప్పటికే, ప్రతిపక్ష పార్టీగా తెదేపా పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్ల ఆ పార్టీకి చెందిన అన్ని కార్యాలయాలకు ఫర్ సేల్ బోర్డును తగించే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. అలాగే, ప్రజాసేవ చేయాలన్న మంచిబుద్ధి రావాలంటే వైఎస్సార్, సోనియా గాంధీ ఫోటలకు తెదేపా నేతలు పూజలు చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకే జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాతే రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గతయేడాది ఫిబ్రవరి నెలలో అసెంబ్లీలో చేసిన తీర్మానికి అనుగుణంగానే శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు ఉంటాయని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.