జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నాని అగ్నికి ఆజ్యం పోశాడు: చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu | Kodali Venkateswara Rao | Telangana | United Andhra)
Bookmark and Share Feedback Print
 
తెలంగాణా- సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఒకపక్క రాష్ట్రం రగిలిపోతుంటే వాటికి మరింత ఆజ్యం పోసేటట్లు కొడాలి నాని వ్యాఖ్యలు చేశాడని, అవి సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నాని వ్యాఖ్యలపై స్పందించారు.

నాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మాట్లాడుతూ... సున్నితమైన అంశాలపై మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలనీ, ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడకూడదన్నారు. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదనీ, నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

అదేసమయంలో తెలంగాణా, సీమాంధ్రలు రెండూ తనకు రెండు కళ్లులాంటివనీ, రెండు ప్రాంతాల ప్రజలు తనకు సమానమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సున్నితమైన సమస్యతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాటిని చల్లార్చడానికి ప్రయత్నించాలి తప్ప మరింత మండేవిధంగా మాట్లాడకూడదని హితవు పలికారు. నాని వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరి సమైవాదులు చంద్రబాబు స్పందనలకు ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.