జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నేడు కోర్ కమిటీ భేటీ: విధి విధానాలపై ప్రకటన! (Congress | Core Committee | Srikrishna | Chidambaram | Telangana)
Bookmark and Share Feedback Print
 
కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర హోం మంత్రి చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీలు హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం పరిశీలనాంశాలపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రాలుగా జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ పని చేయనుంది. ఈ కమిటీ కోసం ఖరారు చేసిన విధి విధానాలపై కోర్ కమిటీ సమావేశంలో మరోమారు చర్చించి అధికార పూర్వక ప్రకటన చేయనున్నారు. ఇదిలావుండగా, వీటిని ప్రకటించిన వారంరోజుల్లో కమిటీ తన విధులను ప్రారంభిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.