జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ తథ్యం: ధర్మపురి (Congress | By poll | DS | PCC | President | Hyd | Telangana)
Bookmark and Share Feedback Print
 
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేసిన కారణంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి తీరుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా తెరాసకు చెందిన పది మంది సభ్యులతో పాటు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యులు రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.

ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ పార్టీ సభ్యులు కూడా భాగస్వాములై ఉన్నారనే విషయం ఆ ప్రాంత ప్రజలకు తెలుసన్నారు. అందువల్ల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. రైతులు, పైదలు, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉందన్నారు.

ప్రధానంగా మూడు నుంచి ఐదు లక్షల ఆదాయం కలిగిన వారికి వెసులు బాటు కల్పించడం వల్ల చాలామంది మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పారు. ఇకపోతే స్థానిక సంస్థల బలోపేతం చేయాలన్న తపన ప్రణబ్ ముఖర్జీ రూపొందించిన బడ్జెట్‌లో కనిపించిందన్నారు.

ఇకపోతే చీరాల శాసనసభ్యుడు ఆమంచి శ్రీకృష్ణమోహన్‌పై డీఎస్ మాట్లాడుతూ మీడియా పట్ల దురుసుగా వ్యాఖ్యానించడం తగదన్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకుని రావాలని రావాలే గానీ, బహిరంగంగా మీడియాపై విమర్శలు చేయరాదని హితవు పలికారు. ముఖ్యంగా, వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.