ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కార్పొరేట్-పారిశ్రామిక అనుకూల బడ్జెట్: మైసూరా రెడ్డి (Corporate | Industrial | Mysura Reddy | TDP | Budget)
కార్పొరేట్-పారిశ్రామిక అనుకూల బడ్జెట్: మైసూరా రెడ్డి
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010( 17:16 IST )
2010-11 సాధారణ బడ్జెట్ కార్పొరేట్, పారిశ్రామికవర్గాల అనుకూల బడ్జెట్‌గా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.మైసూరా రెడ్డి అన్నారు. ఆయన ఢిల్లీలో బడ్జెట్‌పై స్పందన వ్యక్తం చేస్తూ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ బడ్జెట్ పేదలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదన్నారు. ఒక విధంగా చెప్పాలంటే షావుకార్ల బడ్జెట్ అని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి నిత్యావసర వస్తు ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలన్నీ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
ధరల నియంత్రణకు చేపట్టే చర్యలను ప్రభుత్వం వెల్లడించలేదు కదా, పెట్రో ఉత్పత్తులపై 7.5 శాతం ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ధరలను మరింతగా పెరిగేలా చేసిందన్నారు. అందువల్ల ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.