జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదు: అంబటి (Ambati Rambabu | PCC | Telangana | Bypoll | Bosta | Srikrishna)
Bookmark and Share Feedback Print
 
తమతమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పులేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేయడంలో తప్పులేదన్నారు.

ఇందులోభాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది కూడా ఇందుకే కదా అని గుర్తు చేశారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని. అలాగే, కమిటీ ఎదుట తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని చెప్పారు.

కేంద్రం కమిటీని నియమించింది ఎవరి అభిప్రాయం వారు చెప్పాలనే కదా అని అంబటి ప్రశ్నించారు. ఇకపోతే.. తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి తీరుతుందని ఆయన నొక్కివక్కాణించారు. మొత్తం 12 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.