ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విభజనకు జైకొట్టు.. భవిష్యత్ బాగుంటుంది: జానా (Devide | Future | Jana Reddy | Chiru | PRP | Telangana | United Andhra)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి రాష్ట్ర మాజీ హోంమంత్రి కె.జనారెడ్డి ఒక సూచన చేశారు. చిరంజీవి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సలహా ఇచ్చినట్టు సమాచారం. భవిష్యత్ బాగుండాలంటే సమైక్యవాదానికి గుడ్‌బై చెప్పి.. విభజనకు అనుకూలంగా ప్రకటన చేయాలని కోరినట్టు సమాచారం.
చిరంజీవి, జానారెడ్డిలు పీఆర్పీ శాసనసభా కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిమధ్య మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విభజన వ్యాఖ్యల చర్చకు వచ్చినట్టు సమాచారం. మున్ముందు సమైక్యాంధ్ర ఉద్యమం నీరుగారి పోతుందని, అందువల్ల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చిరంజీవిని జానారెడ్డి కోరినట్టు సమాచారం.
ఇప్పటికే, మంత్రి బొత్సతో పాటు.. మరికొంతమంది మంత్రులు విభజన బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా జానారెడ్డి చెప్పినట్టు వినికిడి. అయితే, చిరంజీవి మాత్రం శ్రద్ధగా ఆలకించినట్టు మిన్నకుండిపోయినట్టు తెలుస్తోంది.
సమావేశం అనంతరం చిరంజీవి, జానారెడ్డి మాట్లాడుతూ.. సినిమాలకు సంబంధించి తాము మాట్లాడుకున్నామని ఇరువురు నేతలు వెల్లడించారు. రామ్ చరణ్‌తో జానారెడ్డి కుమారుడు సినిమా చేయాలనుకుంటున్నారని, ఆ విషయమై తాము మాట్లాడుకున్నామని చిరంజీవి తెలిపారు. కాగా, ఈ భేటీలో అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.