జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » గవర్నర్ "విందు"కు.. కమిటీ "ముందు"కు తెరాస! (Governer | Srikrishna | TRS | KCR | JAC | Telangana | United Andhra)
Bookmark and Share Feedback Print
 
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని మెల్లగా మార్చుకుంటోంది. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు, సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం వేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట హాజరుకావాలని నిర్ణయించింది. అలాగే, శ్రీకృష్ణ బృందంతో పాటు ఎనిమిది పార్టీల నేతలకు గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ఈనెల నాలుగో తేదీన ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి కూడా హాజరుకావాలని తెరాస అధినాయకత్వం నిర్ణయించింది.

ఇదేవిషయంపై బుధవారం జరిగే ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తీర్మానం చేయనున్నారు. తెరాస నాయకత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)తో ఉన్న బంధాన్ని ఆ పార్టీ తెంచుకున్నట్టేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట హాజరుకారాదని ఐకాస పిలుపునిచ్చిందని, కానీ తాము మాత్రం కమిటీ ఎదుట హాజరుకావాలని నిర్ణయించామని గుర్తు చేశారు.

అంతేకాకుండా, ఐకాస పిలుపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెదేపాలు కూడా కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపిచేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెరాస కమిటీ ఎదుట హాజరుకాక పోతే విభజనవాదం బలహీన పడే అవకాశం ఉందని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. పైపెచ్చు సమైక్య వాదుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావన వారిని వెంటాడుతోంది.

అందువల్లే ఐకాస నిర్ణయాలకు వ్యతిరేకంగా నడుచుకోవాలని తెరాస చీఫ్ కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. అంతేకాకుండా, శ్రీకృష్ణకు నివేదిక రూపంలో తెలంగాణ వాదాన్ని వినిపించకపోతే, వారు విభజన అంశాన్ని పరిగణలోకి తీసుకొకపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు తెలిసింది.

అందువల్ల కమిటీకి సమర్పించే నివేదికను ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ వంటి నిపుణులతో తయారు చేయించే పనిలో కేసీఆర్ నిమగ్నమైవున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. అయితే, తెరాస తీసుకున్న తాజా నిర్ణయానికి తెలంగాణ జేఏసీ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.