జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బేగంపేటలో కూలిన విమానం.. పైలట్ మృతి: ఏకేఖాన్ (Aerobatic team | plane | crashes | pilot | injured | Hyderabad | AkKhan)
Bookmark and Share Feedback Print
 
PTI Photo
PTI
బేగంపేట్ ఎయిర్‌షో ప్రదర్శన ప్రారంభ వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంలో పైలట్ మృతి చెందినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ తెలిపారు. అలాగే, మరో నలుగు గాయపడినట్టు ఆయన బుధవారం వెల్లడించారు.

బేగంపేట్‌లో అంతర్జాతీయ ఎయిర్ షో ప్రారంభమైంది. ఈ ప్రారంభవేడుకల్లో నావల్ ఏరోబోటిక్‌ బృందానికి చెందిన నాలుగు విమానాలు ఆకాశంలో సూర్యకిరణ్ విన్యాసాలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఒక విమానం అకస్మాత్తుగా న్యూ బోయిన్‌పల్లిలోని జనావాస ప్రాంతాల్లో కూలిపోయింది.

దీనిపై నగర పోలీసు కమిషనర్ ఏకే.ఖాన్ మాట్లాడుతూ.. 'సాగర్ పవన్' ఏరోబోటిక్ టీమ్ నిర్వహిస్తున్న విన్యాసాల్లో కిరణ్ ఎంకే-2 రకం విమానం ఒకటి ఒక భవంతిపై కూలిపోయినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకు ఒక భవనం దెబ్బతింది.

అందులో ఎంతమంది ఉన్నారో చూడాల్సి వుంది. అయితే, నలుగురు మాత్రం గాయపడినట్టు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. విమాన కూలిపోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.