జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రేపటి నుంచి శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పర్యటన! (Srikrishna | State tour | Chidambaram | Hyd | Political parties | Duggal)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం రాష్ట్రానికి రానుంది. ఈ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ, కమిటీ సభ్య కార్యదర్శి వీకే.దుగ్గల్‌తో పాటు మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

ఈ కమిటీ నగరంలో రెండు రోజుల పాటు ఉండి ఎనిమిది రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో లిఖితపూర్వకమైన అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఈ కమిటీ ముందు తమతమ వాదనలు వినిపించడానికి రాష్ట్రంలోని వివిధ ఉద్యమాల్లో భాగస్వాములైన అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నారు.

ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర, జై ఆంధ్ర, గ్రేటర్ రాయలసీమ, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం తదితర వాదనలతో ఇంతకాలం ఉద్యమాలు, ఆందోళనలు చేసిన వారంతా శ్రీకృష్ణ కమిటీకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.

కాగా, కమిటీకి చెప్పాల్సిన అభిప్రాయాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే సమావేశమై కమిటీ ముందుంచాల్సిన అంశాలపై ప్రాథమికంగా చర్చించారు.

ఇకపోతే.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కమిటీ ముందు హాజరయ్యే విషయంలో మల్లగుల్లాలు ఇంకా పడుతోంది. కమిటీ ఏర్పాటు అయిందే తెలంగాణ విషయాన్ని తేల్చటానికైనప్పుడు వెళ్ళకుండా ఎలా ఉంటామని ఈ ప్రాంత సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

ఇకపోతే తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కమిటీ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించాలని భావిస్తోంది. అయితే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పరిస్థితి మాత్రం డోలాయమాన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

అయితే, కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. తెలంగాణ జేఏసీ శాంతియుత ఆందోళనలకు పిలుపునిచ్చింది. నాలుగు, ఐదు తేదీల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై సంప్రతింపుల కోసం ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత ఉందని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం మంగళవారం రాత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం నియమించే పాలనాపరమైన కమిటీలకు ఉండే అధాకారాలు ఈ కమిటీకి వర్తిస్తాయని ఆయన తేల్చి చెప్పారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో జస్టిస్ శ్రీకృష్ణ ఈ కమిటీ వ్యవహారాలకు నేతృత్వం వహిస్తారని, అన్ని బాధ్యతాయుత పార్టీలు కమిటీ ముందు హాజరై తమ వాదనలను వినిపిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.