జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీఎం పదవికి రోశయ్య అన్‌ఫిట్.. బొత్స ఫిట్: దామోదర్ రెడ్డి (CM | Damodar Reddy | Bosta | Telangana | Srikrishna | Regional)
Bookmark and Share Feedback Print
 
File
FILE
ముఖ్యమంత్రి పదవికి కె.రోశయ్య అన్‌ఫిట్ అని, పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఆర్.దామోదర్ రెడ్డి ఫిట్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రోశయ్య పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రిపదవికి బొత్స సత్యనారాయణను ఎంపిక చేస్తే తమతో పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా మద్దతు ఇస్తారని చెప్పారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇవ్వని పక్షంలో తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెపుతానని ఆయన స్పష్టం చేశారు.

అదే సమయంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. దీనికి తమ పార్టీకి చెందిన అనేక మంది మద్దతు ఇస్తారని భావిస్తున్నట్టు దామోదర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.