జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సోనియాకు భారత రత్న ఇవ్వాలి: గంగా భవాని (Women resarvation bill | Bharataratna | Ganga Bhavani | AICC | PCC | President | Sonia | Rajya sabha)
Bookmark and Share Feedback Print
 
దేశంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి నెగ్గిందని, ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారతరత్న అవార్డును ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

రాజ్యసభలో మహిళా బిల్లు నెగ్గిన సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం (పీసీసీ)వద్ద మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆనందంలో బాణాసంచా కాల్చి నృత్యాలతో మహిళా నేతలంతా ఎంతో ఘనంగా పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు గంగాభవాని మాట్లాడుతూ దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలపాటు మూలనపడివున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం ప్రసాదించిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తొలుత శుభాకాంక్షలన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని తాము కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌‍కు విన్నవిస్తున్నామన్నారు.

మరో మహిళా నాయకురాలు త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మోక్షం లేని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదేనన్నారు. దేశ చరిత్రలో సోనియా గాంధీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలకు పట్టం కట్టిన సోనియా గాంధీని భారతరత్న అవార్డుతో సత్కరించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

గతంలో ఎన్నో ప్రభుత్వాలు సాధించలేని మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా అత్యంత సునాయాసంగా సాధించారని, బిల్లును గట్టెక్కించడం వెనుక ఆమె సమర్థత ఏంటో ప్రతిపక్షాలు తెలుసుకోవాలన్నారు. రాజీవ్ గాంధీ కన్న కలలను సాకారం చేసేందుకు ఆమె నిరంతరం కృషి చేస్తోందని సోనియాను ఆమె కొనియాడారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.