ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెదేపా అధ్యక్ష పగ్గాలు బాలకృష్ణ చేపట్టాలి: లక్ష్మీపార్వతి (TDP | President | Balakrishna | Chandrababu | Purandheswari)
తెదేపా అధ్యక్ష పగ్గాలు బాలకృష్ణ చేపట్టాలి: లక్ష్మీపార్వతి
గురువారం, 11 మార్చి 2010( 09:36 IST )
స్వర్గీయ ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలను సినీ నటుడు, ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ చేపట్టాలని ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. తన బిడ్డ పార్టీ పగ్గాలు చేపట్టిన మరుక్షణంలే నందమూరి కుటుంబమంతా ఏకమై పార్టీ పటిష్టతకు పాటుపడుతుందని ఆమె జోస్యం చెప్పారు.
ఎన్టీఆర్ మృతి చెందిన 15 యేళ్ల తర్వాత బాలకృష్ణ తన తండ్రి నివశించిన, ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటికి బుధవారం వెళ్లిన విషయం తెల్సిందే. దీనిపై లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డ నా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందక్షణాలు తన జీవితాతం గుర్తుండి పోతాయన్నారు.
అదేసమయంలో చంద్రబాబు అన్నగారి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను బాలకృష్ణ చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల నందమూరి కుటుంబమంతా ఏకమవుతుందన్నారు. ముఖ్యంగా, కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ పుత్రరత్నం దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తిరిగి సొంతగూటికి వస్తారనే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.