జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగావుంది : నరసింహన్ (ESL Narasimhan | AP | Governor | Harsilihills | Chittoor | Rishivally)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ హార్సీహిల్స్‌లో తెలిపారు.

గవర్నర్ నరసింహన్ రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాలోని హార్సిలీహిల్స్‌కు గురువారం ఉదయం చేరుకున్నారు. ఇక్కడ ఆయన అతిథిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం మదనపల్లి సమీపంలోనున్న తుమ్మచెట్టుపల్లి, రివర్‌ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో గడిపారు. అనంతరం రిషివ్యాలీ పాఠశాలను, అక్కడి జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు.

గవర్నర్ రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ లక్ష్మీ రెడ్డి తెలిపారు. బందోబస్తులో భాగంగా ఎనిమిది మంది సిఐలు, 25 మంది ఎస్ఐలు, 45 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, 150 మంది కానిస్టేబుళ్ళు, 70 మంది హోంగార్డులు, స్పేషల్ పార్టీ బలగాలు, ఇద్దరు ఏఆర్ ఎస్ఐలు, 434 మంది ఏఆర్ కానిస్టేబుళ్ళను బందోబస్తుకు నియమించామన్నారు. పోలీసు వర్గాలు వెల్లడించాయి.

గతంలో ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టరుగా పనిచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని తీవ్రవాద కార్యకలాపాలను ఆయన అణచి వేశారు. దీంతో గవర్నర్‌‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.