జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో "ఆ ముగ్గురు" నేతలు! (Deputy CM | DS | Jana Reddy | Geeta Reddy | Congress | Rosaiah)
Bookmark and Share Feedback Print
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం పచ్చజెండా ఊపింది. అలాగే, వయోభారంతో అలసిపోతున్న ముఖ్యమంత్రి రోశయ్యకు డిప్యూటీని ఎంపిక చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే అభ్యర్థి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉండాలని షరతు విధించినట్టు చెపుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ మార్పులు, చేర్పులకు అధిష్టానవర్గం అనుమతించినట్టు సమాచారం. పైపెచ్చు.. ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయనున్నారు. ఈ రేసులో సీనియర్ నేత కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ మంత్రి, శాసనసభా నాయకురాలు గీతారెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఇపుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున మంత్రివర్గ మార్పుల జోలికి వెళ్లరాదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ కార్యక్రమాన్ని ముగించాలని ముఖ్యమంత్రి అనుకున్నా రాజకీయ వాతావరణం అనుకూలించని కారణంగా అసెంబ్లీ సమావేశాల తర్వాతకు వాయిదా వేశారు.

అలాగే మంత్రివర్గ విస్తరణంటూ జరిగే సీనియర్ నేతలైన జానారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, డీఎల్.రవీంధ్రా రెడ్డి, శంకర్‌రావు వంటి వారికి రోశయ్య తన మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, అధిష్టానాన్ని ధిక్కరిస్తూ వ్యవహరించిన వారిపై వేటు వేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, పలు శాఖలను రెండుగా విభజించి అదనంగా మరికొంతమందికి మంత్రి పదవులు కట్టబెట్టాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉన్నట్టు తెలుస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.