జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » శాఖమూరి ఎన్‌కౌంటర్... 22, 23 తేదీల్లో బంద్: మావోలు (Maoists | Kishan ji | Sakhamuri | Bandh | AP | Elcounter)
Bookmark and Share Feedback Print
 
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు సోలిపేట కొండల్‌ రెడ్డిల ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 22, 23, తేదీల్లో బంద్‌కు పిలుపునిస్తున్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. 48 గంటలపాటు సాగే ఈ బంద్‌ మొత్తం ఆరు రాష్ట్రాల్లో పాటిస్తామని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కిషన్‌ జీ తరపు ప్రతినిధి ధనుంజయ్ వెల్లడించారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోజరిగిన మావోయిస్టు అగ్రనేతల ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. అప్పారావు, కొండల్‌ రెడ్డిలను మహారాష్ట్రలో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య చేశారని ఆరోపించారు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ధరలను అదుపు చేసేందుకు శ్రద్ధ చూపని కేంద్రం.. గ్రీన్ హంట్ పేరిట మావోయిస్టుల ఏరివేతను చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో కేంద్ర రైల్వే మంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ద్వంద వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించారు. ఆదివాసీలపై హింసను ఆపితే.. తాము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.