జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మిస్టర్ చిరు.. హైదరాబాద్‌ను వదిలివెళ్లు: రాములమ్మ (Pro-Telangana | Vijayashanti | tells | Chiranjeevi | quit | Hyderabad)
Bookmark and Share Feedback Print
 
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకనాటి హీరో హీరోయిన్ల మధ్య మళ్లీ నిప్పు రాజుకుంది. ఆది నుంచి వీరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వారిద్దరే మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ ఆడబిడ్డ విజయశాంతి. చిరంజీవి అంటే అస్సలు పడని విజయశాంతి ఆయనపై మరోమారు కత్తులుకారాలు నూరుతున్నారు.

తెలంగాణ, సమైక్యాంధ్ర పుణ్యమాని చిత్ర పరిశ్రమకు చెందిన హీరోహీరోయిన్ల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపిన విషయం తెల్సిందే. ఒకనాడు అగ్రహీరోయిన్‌గా వెలుగొందిన విజయశాంతి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

అయితే, ప్రస్తుతం చిరంజీవిపై ఆమె మాటలతూటాలు పేల్చుతున్నారు. చిరంజీవి తెలంగాణ ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. తెలంగాణను వ్యతిరేకించే ఆయనకు తెలంగాణ గడ్డపై నివశించే నైతిక హక్కు ఏమాత్రం లేదంటున్నారు. అందువల్ల ఆయన తక్షణం హైదరాబాద్‌ను వీడి పోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే చిరంజీవి హైదరాబాద్‌లో నివశించే నైతిక హక్కు లేదు. అంతేకాదు భవిష్యత్‌లో తెలంగాణ ప్రాంతంలో చిరంజీవి పర్యటిస్తే ఈ ప్రాంత ప్రజల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరించారు.

తాజాగా, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా చేయడం వల్ల ఒక్క సీమాంధ్ర ప్రాంత వాసులకే కాకుండా ఐదో జోన్‌లో ఉన్న తెలంగాణలోని కొన్ని జిల్లాల వాసులు కూడా తీవ్రంగా నష్టపోతారని చిరంజీవి వాదిస్తున్నారు. దీనిపై కూడా రాములమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.