జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చర్చలేకుండా ఆమోదించడం భావ్యం కాదు: భాజపా (BJP | Talk | Kishan Reddy | Assembly | Political parties | Free zone | Hyd)
Bookmark and Share Feedback Print
 
ఫ్రీజోన్ అంశంపై చేసిన తీర్మానంపై ఎలాంటి చర్చ లేకుండా సభలో ఆమోదించడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతం తెలిపాయన్నారు.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన శాసనసభ నేతల అఖిలపక్ష భేటీలో కూడా ఆమోదం తెలిపారన్నారు. తీరా సభలో తీర్మానం ప్రవేశపెట్టబోయే సమాయనికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన సభ్యులు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్, తెదేపా, ప్రరాపా వంటి పార్టీలు రెండు నాల్కల ధోరణిని, ద్వంద వైఖరిని, అవకాశవాద రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపోతే.. ఫ్రీజోన్ అంశంపై చేసిన తీర్మానంపై సభలో చర్చకుండా ఆమోదించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కొన్ని అంశాలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.