ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీఎం కార్యక్రమాలను అడ్డుకోండి: సీమాంధ్ర విద్యార్థులు (CM | Tour | Students | Free zone | Resolution | Assembly | Seemandhra)
సీఎం కార్యక్రమాలను అడ్డుకోండి: సీమాంధ్ర విద్యార్థులు
శుక్రవారం, 19 మార్చి 2010( 17:03 IST )
హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి మినహాయింపు ఇస్తూ ముఖ్యమంత్రి కె.రోశయ్య అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సీమాంధ్ర విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే, ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు శనివారం విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి ప్రజారాజ్యం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అలాగే, జిల్లా పర్యటనకు వస్తే ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని ఏయూ జేఏసీ హెచ్చరించింది.
ఇకపోతే... అనంతపురంలోని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ కూడా ఇదే తరహాలో పిలుపునిచ్చేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ నిబంధనను తొలగించాలని రోశయ్య తీర్మానం ప్రవేశపెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. తమ జిల్లా పర్యటనకు రోశయ్య వస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.