జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఇద్దరు మావోల హతం: పోలీసుల అదుపులో ఆజాద్? (Moists | Police | Azad | Girish kumar | DGP | Khammam | Forest)
Bookmark and Share Feedback Print
 
ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే, ఖమ్మం జిల్లా పోలీసుల అదుపులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ అలియాస్ రాజ్‌కుమార్ ఉన్నట్టు వదంతులు వ్యాపించాయి. దీనిపై రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ వెంటనే స్పందించారు. పోలీసుల అదుపులో రాజ్‌కుమార్ లేరని స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, వెంకటాపురం-వాజేడు సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. పోలీసుల రాకను గుర్తించిన మావోలు కాల్పులు జరిపారు. వీటి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మావోలు హతమయ్యారు.

హతమైన మావోయిస్టులను సుఖ్‌దేవ్ దళానికి చెందిన కణితి పుల్లయ్య, ఆయన భార్య లక్ష్మీలుగా గుర్తించారు. వీరి నుంచి రెండు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరిని రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపినట్టు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.