జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాయల తెలంగాణ వద్దు.. సమైక్య రాష్ట్రమే ముద్దు! (Rayala Telangana | United Andhra | JC | TG Venkatesh | Srikrishna | Regional)
Bookmark and Share Feedback Print
 
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నిన్నటి వరకు గ్రేటర్ రాయలసీమ, రాయల తెలంగాణ డిమాండ్లను తెరపైకి తెచ్చిన సీమ ప్రాంత నేతలు.. ఇపుడు వెనక్కి తగ్గారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగానే ఉందామని ఐక్యతారాగాన్ని ఆలపించారు.

రాష్ట్రం ముక్కలైతే అధికంగా నష్టపోయేది తామేనని వారు వాపోయారు. సమైక్య రాష్ట్రంలోనే మాకు న్యాయం జరుగుతుందని గ్రహించారు. అందువల్ల రాష్ట్ర విభజనకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని వారు కుండబద్ధలు కొట్టినట్టు చెపుతున్నారు. అంతేకాకుండా, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి రాయలసీమ ప్రాంత సమస్యలను ఎత్తిచూపుతూనే.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరనున్నట్టు ప్రకటించారు.

సీమ ప్రాంతానికి చెందిన నేతలంతా శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలైన టీజీ.వెంకటేష్, జేసీ.దివాకర్ రెడ్డి, వైఎస్.వివేకానంద రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఇందులో కీలక తీర్మానాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యధావిధిగా కొనసాగించాలన్నది తమందరి ఏకగ్రీవ నిర్ణయంగా వారంతా ముక్తకంఠంతో చెప్పారు. ఈ మేరకు కమిటీకి సమర్పించే నివేదికలో వారు సంతకాలు చేశారు. అలాగే సమైక్యాంధ్ర కోరుకునే తెలంగాణ నేతలతో కూడా సంతకాలు చేయిస్తామని వారు ప్రకటించారు.

రాజధానితో సహా అనేక త్యాగాలు చేసిన సీమ ప్రాంతానికి సమైక్య రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందని రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్ టీజీ.వెంకటేష్ అన్నారు. తెలంగాణ వెనుకబాటు తనానికి చూపుతున్న లెక్కల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. తొలుత గ్రేటర్ రాయలసీమ కావాలని కోరుకున్నామని అయితే, ఇపుడు సమైక్యాంధ్ర కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.