జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఓట్ల లెక్కింపును వీడియో చిత్రీకరిస్తాం: ఐ.వి.సుబ్బారావు (Vote counting | IVSubba Rao | EVM | Ballet box | Video shoot | Regional)
Bookmark and Share Feedback Print
 
ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియనంతా వీడియో తీయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ పెట్టెలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్నట్టు ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ తాళాలు తెరిచినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకు వీడియో చిత్రీకరణ జరుపుతామని ఆయన తెలిపారు.

ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం తమ ఈ చర్య ఉపకరిస్తుందన్నారు. స్ట్రాంగ్ రూములు ప్రతి చర్యను మోషన్ సెన్సార్లు పసికడతాయన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం 11 గంటలకే వెలువడ వచ్చన్నారు. అదేసమయంలో బ్యాలెట్ పత్రాలు వినియోగించిన స్థానాల్లో ఫలితాలు మధ్యాహ్నంపైనా వెలువడవచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.