జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: భట్టి విక్రమార్క (YS | State | Congress | Bhattivikramarka | Babu | TDP | Rosaiah)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వ చీప్ విఫ్ భట్టి విక్రమార్క, విప్‌లు శైలజానాథ్‌లు అభిప్రాయపడ్డారు. వైఎస్ మరణించిన రోజు నుంచే ఇది తేటతెల్లమైందన్నారు.

ఉప ఎన్నికల ఫలితాలపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో పాటు మరికొన్ని సంస్థలు ప్రకటించిన సర్వేలపై వారు స్పందించారు. తమ పార్టీ ఎంపీ లగడపాటి నిర్వహించిన సర్వేపై తమకు నమ్మకం లేదన్నారు.

ఇకపోతే... ముఖ్యమంత్రి రోశయ్యపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడాన్ని వారు తోసిపుచ్చారు. ఆరేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబుకు బుర్ర పని చేయడం తగ్గిపోయిందన్నారు. అందువల్లే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

సొంత పార్టీ నేతలే చంద్రబాబును నమ్మలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఒకవేళ ఎవరైనా ఉంటే.. వారిని నట్టేట ముంచే రకం చంద్రబాబుదన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంటాయన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.