ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఆగస్టు 2న ప్రధాని అధ్యక్షతన మహా-ఆంధ్రా సీఎంల భేటీ! (August | All party meet | PM | Maharashtra | AP | CM's meet | Regional)
ఆగస్టు 2న ప్రధాని అధ్యక్షతన మహా-ఆంధ్రా సీఎంల భేటీ!
మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. అఖిలపక్ష నేతల విజ్ఞప్తి మేరకు సమస్య పరిష్కారానికి ప్రధాని చర్యలు చేపట్టారు.
ఇందులోభాగంగా, ఆగస్టు రెండో తేదీన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం జరుగనుంది. ఈ మేరుకు ముఖ్యమంత్రి కె.రోశయ్యకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గురువారం సమాచారం వచ్చింది.
ఈ సమావేశ ఫలితం ఎలా ఉండబోతుందనే విషయం పక్కన పెడితే.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం పరిష్కారానికి ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయంగా భావించవచ్చు. ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవ పరిస్థితులు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.