జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఎంతకాలం ఈ సహనం ఉంటుందో తెలీదు: వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy | Odaarpu | 27 MLAs | Rosaiah)
Bookmark and Share Feedback Print
 
FILE
తూర్పు గోదావరి జిల్లాలో 18 రోజులపాటు సాగిన జగన్ ఓదార్పు యాత్ర కాకినాడ నేతాజీ పార్క్ వద్ద భారీ జనసందోహం మధ్య ముగిసింది. ఈ సభలో వైఎస్ జగన్ ఉద్వేగంగా మాట్లాడారు. తన పట్ల అతి ప్రేమను చూపిన అంబటి రాంబాబు, కొండా సురేఖలకు జరిగిన అన్యాయం చూసి తన గుండె భారంగా ఉందనీ, బరువెక్కి పోయిందని అన్నారు. ఎంత కాలం ఈ సహనం తనకు ఉంటుందో, ఎన్ని రోజులు ఇలా ఉండగలనో తెలియదని కాంగ్రెస్ అధిష్ఠానంపై సవాల్ విసిరారు.

2004 వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలో నిలబెట్టడమే కాక పేదవాడు జీవితంలో వెలుగులు నింపాలని తన తండ్రి వైఎస్సార్ అహరహం కృషి చేశారన్నారు.

"ఈనాడు రాష్ట్రంలో 26 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే దానికి కారణమెవరూ అని అడుగుతున్నాను నేను... సంక్షేమ పథకాలు పేదవాడికి అందుతున్నాయంటే దానికి కారణమెవరు..? ప్రాజెక్టులు కట్టించి... జలయజ్ఞం చేసి కోటి ఎకరాలకు సాగు చేసిన ఘనత ఎవరిదని అడుగుతున్నాను...? ఇన్ని చేసిన మహా నాయకుడు కన్నుమూస్తే, ఆయన చనిపోయినందుకు కొన్ని గుండెలు ఆగిపోతే.. వారిని పరామర్శించడం తప్పా...? అందులో రాజకీయ కుట్ర దాగి ఉందా...?" అంటూ ప్రశ్నించారు.

తన ఓదార్పు యాత్ర వెనుక తనలో ఎటువంటి కుళ్లూ కుతంత్రం లేదనీ, కానీ కొంతమంది మాత్రమే తను చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు యత్నించారన్నారు. ఈ పరిస్థితిల్లో ఒకటే అనుకున్నాను. అదేమంటే... ఎంతకాలం బతికాం అన్నది కాదు.. ఎలా బతికాం, ఎవరికోసం బతికాం అన్నది ముఖ్యమని అనుకుని అన్నీ వదులుకుని నాన్నకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం మీకోసం కదిలి వచ్చానన్నారు. మొత్తమ్మీద జగన్ యాత్ర రోశయ్య సర్కారుకే కాక, కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా సవాల్ విసిరినట్లు కనిపిస్తోంది.

కాగా ఈ సభకు మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరైనట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఈ సంఖ్యాబలంతో రోశయ్య సర్కార్ ను ఠారెత్తించే పరిస్థితి జగన్‌కు ఉన్నదని అర్థమవుతుంది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో... ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే...!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.