జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణా కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: అందుకే తెరాస స్వీప్ (Congress | Ananta Venkata ramireddy | TRS | By poll | Telangana)
Bookmark and Share Feedback Print
 
తెలంగాణాలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలే కారణమని కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల అక్కడి నేతల్లో ఏ కోశానా కనబడలేదన్నారు.

ఎవరో ఒకరిద్దరు తప్పించి మిగిలిన నాయకులంతా తెరాస విజయం సాధిస్తేనే బావుంటుందన్న ధోరణిలో పర్యటనలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎన్నికలను తేలికగా తీసుకోవడంతో తెరాసకు అన్ని స్థానాలు, అంత మెజారిటీ వచ్చిందన్నారు.

ఈ ఉపఎన్నికల్లో ఘోర వైఫల్యానికి నాయకత్వ లోటు స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు ఉరికిన అభ్యర్థి ఒక్కరు కూడా కనబడ లేదన్నారు. ఈ తప్పిదాల వల్లనే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకున్నదన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వేదికపై చర్చించుకుని ముందుకు సాగుతామన్నారు. తెరాస గెలిచినంత మాత్రాన ప్రజలంతా తెలంగాణాకు అనుకూలంగా ఉన్నారని అనుకోవడం పొరపాటనీ, గెలుపు ఓటములు సహజమని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.