జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నాడు ప్రజారాజ్యం... నేడు తెదేపా గల్లంతు: విజయశాంతి (vijayasanthi | prp | tdp | by poll | telangana | trs)
Bookmark and Share Feedback Print
 
గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గల్లంతైందని... ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా నేత, మెదక్ ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన 12 సెగ్మెంట్లలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు ధరావత్తు గల్లంతైందని ఆమె గుర్తు చేశారు.

ముఖ్యంగా, సమైక్యాంధ్ర బాట పట్టిన ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా తుడిసి పెట్టుకుని పోయిందన్నారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లతో సమానమన్న తెదేపా పూర్తిగా భూస్థాపితమయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ మేల్కొని తెలంగాణకు జైకొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రజల తాజా తీర్పు సీమాంధ్ర నేతలకు కనువిప్పు కావాలన్నారు. అందువల్ల వీరంతా ఏకమై తెలంగాణ వచ్చేలా చూడాలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ గడ్డపై ఉన్న సీమాంధ్ర ప్రజానీకానికి ఈ ప్రాంత ప్రజలు పెట్టేబేడా చేతికి ఇచ్చి పంపే సమయం వస్తుందని విజయశాంతి జోస్యం చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.