జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సెంటిమెంట్ వల్లే తెరాస అభ్యర్థుల విజయం: పురంధేశ్వరి! (Sentiments | Telangana | Purandheswari | Congress | TRS | Regional news)
Bookmark and Share Feedback Print
 
తెలంగాణ ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఘన విజయం సాధించారని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ గౌరవించి తీరాలన్నారు.

తెరాస అభ్యర్థుల ఘన విజయానికి అక్కడి ప్రజల్లో ఉన్న సెంటిమెంటే ఏకైక కారణమన్నారు. ప్రత్యేక సెంటిమెంట్ అంతగా లేకుంటే కాంగ్రెస్ కనీసం మూడు నాలుగు స్థానాల్లోనైనా గెలిచి ఉండేదన్నారు. ఏది ఏమైనా.. ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష నిర్వహిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.