ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఇషాన్‌రెడ్డి మృతదేహం వద్ద కంటతడి పెట్టిన కేసీఆర్ (KCR | Ishan Reddy | Sucide | Maisamma talli | OU | Telangana | TRS)
తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థులు గెలుపొందినందుకు మైసమ్మ తల్లికి ఆత్మబలిదానం చేసుకున్న ఇషాన్ రెడ్డి మృతదేహాం వద్ద తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కంటతడిపెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదువుతున్న ఈ విద్యార్థి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో కేసీఆర్ ఓయూ క్యాంపస్‌కు వచ్చి విద్యార్థి మృతదేహానికి నివాళులర్పించే సమయంలో కంట తడిపెట్టుకున్నారు అనంతరం అక్కడే కొద్దిసేపు బైఠాయించారు.
అంతకుముందు హరీష్‌రావు, నాయిని నర్సింగా రెడ్డి, భాజపా నేత బండారు దత్తాత్రేయ, ఎన్.రామచంద్రరావు, వనం ఝాన్సీ, తదితరులు ఇషాన్ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మృతదేహానికి ఓయూ క్యాంపస్‌లోని సంఘటన స్థలంలోనే గాంధీ అసుపత్రి వైద్యుల బృందం పొస్టు మార్టం పూర్తి చేసింది.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యాంపస్ నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి విద్యార్థి సొంత గ్రామమైన మెదక్ జిల్లా, బసత్‌పూర్ గ్రామానికి తరలిస్తారు. ఈ గ్రామంలో జరిగే అంత్యక్రియల్లో తెరాస, భాజపా తరపున గెలిచిన 12 మంది అభ్యర్థులు పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.