జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అపోహలు తొలగి ఉంటాయని భావిస్తున్నాం: ఐవీ (EVM | IVSubba Rao | Election | Telangana | TRS | BJP)
Bookmark and Share Feedback Print
 
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉన్న అపోహలు పూర్తిగా తొలగి పోయి ఉంటాయని భావిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై శనివారం తెల్లవారుజాము నాలుగు గంటలకు ముగిసిందన్నారు.

ఎన్నికలు జరిగిన 12 అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో గెలుపొందినట్టు ఆయన తెలిపారు. ఒకటి, రెండు సంఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సుబ్బారావు పేర్కొన్నారు. అదేసమయంలో ఈవీఎంల వాడకంపై ఉన్న సందేహాలు, అనుమానాలు, అపోహలు రాజకీయ పార్టీలకు తొలగి పోయి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.