జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెదేపాను భూస్థాపితం చేస్తాననడం కేసీఆర్ వెర్రితనం (Harikrishna | KCR | Telangana | Telugudesam)
Bookmark and Share Feedback Print
 
WD
తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖ ద్వారా తెలియజేశారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనుకోవడం కేసీఆర్ వెర్రితనమే అవుతుందని ఎద్దేవా చేశారు.

తెలుగువాడి తడఖాను ప్రపంచం నలుదిశలా వ్యాపింప చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో నిక్షిప్తమైపోయి ఉన్నదన్నారు. ఆ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పుట్టిందన్నారు.

తెలుగుదేశం పార్టీని చంద్రశేఖర రావు విమర్శించడం అంటే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దడం వంటిదేనని హరికృష్ణ ధ్వజమెత్తారు. అసలు తెలంగాణా ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉంటే పార్లమెంటులో బిల్లు పెడితే ఆగుతుందా..? అని ప్రశ్నించారు.

టీడీపి అంటే తెలుగుదేశం డెవలప్‌మెంట్ పార్టీ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణా రిటైల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కలెక్షన్లు వసూలు చేస్తూ పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ తెలుగుదేశాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణా రాష్ట్ర సమితి తెలంగాణా ప్రజలతో నాటకాలాడుతున్నదని మండిపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.