జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిద్దాం: టి ఎంపీలు (Telangana | Sonia Gandhi | MP's | KK | congress | Hyd | Regional news)
Bookmark and Share Feedback Print
 
ఇకపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని మరింత బలంగా వినిపించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు నివాసంలో గురువారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమై తీర్మానించారు.

ప్రత్యేక తెలంగాణ అంశమే ప్రధాన అజెండాగా ఈ ప్రాంత ఎంపీలు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడమే కాకుండా, ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలంతా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక నివేదికను తయారు చేసి సమర్పించాలని వారు భావిస్తున్నారు. ఈ భేటీలోనే ఉప ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ ఓటర్ల మనోగతాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.