జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కొత్త సినిమా చర్చల కోసమే అక్కడకు వెళ్లాం: సైరాభాను (New Film | Sairabhanu | Prostitute | Jyothi | Punjaguuta | Magistrate | Regional)
Bookmark and Share Feedback Print
 
కొత్త చిత్రం చర్చల కోసమే తాము నిర్మాత జువ్వల రాజు నివాసానికి వెళ్లామని, వ్యభిచారం కేసుతో తమకెలాంటి సందేహం లేదని సినీ నటి సైరాభాను, జ్యోతిలు స్పష్టం చేశారు. కుందన్‌బాగ్‌లోని నిర్మాత రాజ నివాసంలో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆదివారం అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ దాడుల్లో నటీమణులు సైరాభాను, జ్యోతి, నీలమణి, సినీ నిర్మాత జువ్వల రాజు, ఒక నైజీరియన్ యువతితో సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

అనంతరం వీరిని పంజాగుట్ట పోలీసులకు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్పగించారు. వీరిపై వ్యభిచారం కేసు నమోదు చేశారు. వీరిని నాంపల్లి నాలుగో కోర్టులోని 14వ మేజిస్ట్రేట్ ఎదుట సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆ సమయంలో సైరాభాను, జ్యోతిలు మేజిస్ట్రేట్‌కు ఒక విన్నపం చేశారు.

కొత్త చిత్రం అవకాశం కోసం తమను రావాల్సిందిగా రాజు కోరారని, అందువల్ల ఆ సమయంలో అక్కడ ఉన్నామన్నారు. ఈ వ్యభిచారంతో తమకెలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై మేజిస్ట్రేట్ స్పందించి, సైరాభాను, జ్యోతిలను బాధితులుగా గుర్తించి వదిలి పెట్టేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. మిగిలిన ఎనిమిది మందికి 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.