జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీక్ష భగ్నం (TTD | Bhumana Karunakar Reddy | Hunger fasting | Tirupati | CBI)
Bookmark and Share Feedback Print
 
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను తిరుపతి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి దీక్ష చేపట్టిన కరుణాకర్ రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. అనంతరం ఆయనను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరపించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజుల క్రితం ఆయన దీక్షకు పూనుకున్న విషయం తెల్సిందే. అయితే, భూమన డిమాండ్‌పై ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం తిరుపతిలో జరిగే ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనను అడ్డుకోవాలని ఆయన అనుచరులతో పాటు తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయించారు.

ఈ పరిస్థితుల్లో రంగ ప్రవేశం చేసిన పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. ఎట్టి పరిస్థితులలోనూ దీక్షను విరమించేది లేదని, ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తానని భూమన ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.