ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు (Chandra Babu Naidu | Telugudesam Party | EVM | ADMK | BSP | JDU)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అనుమానాలను నివృత్తి చేసేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈవీఏంలపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని చంద్రబాబు అన్నారు.
ఈవీఎంలపై పార్టీల మద్దతు కూడగట్టేందుకు హస్తినకు వచ్చిన చంద్రబాబు బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అన్నాడీఎంకే, బీఎస్పీ, జేడీయూ సహా అన్ని పార్టీలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయని బాబు తెలిపారు. కాబట్టి ఈవీఎంలపై అనుమానాల నివృత్తికి అఖిలపక్ష భేటీ ఏర్పాటు అవసరమని బాబు డిమాండ్ చేశారు.
అలాగే ఈవీఎంలకు ప్రింటర్ ఏర్పాటు చేసి ఓటు వేసిన తర్వాత ఆ పేపరును ఓటరుకు అందించాలని బాబు కోరారు. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేసిన హరిప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేయడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.