సీమాంధ్రకు చెందిన అధ్యాపకులకు తెలంగాణా లోపట బీఎడ్ మూల్యంకన చేసే అర్హత లేదనీ, వారిని తొలగించేవరకూ స్పాట్ వేల్యూషన్‌లో పాల్గొనబోమని తెలంగాణాకు చెందిన అధ్యాపకులు పట్టుబట్టారు. వేల్యూషన్‌ను బహిష్కరించి విద్యార్థులు చేస్తున్న భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సీమాంధ్ర అధ్యాపకులపై దాడి చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏ తెలంగాణా విద్యార్థీ ఏ అధ్యాపకునిపై చేయి చేసుకోలేదనీ, అదంతా మీడియా సృష్టేనని తెలంగాణాకు చెందిన అధ్యాపకులు చెప్పుకొచ్చారు. తెలంగాణా విద్యార్థులు తెలంగాణా యాసతో రాసే రాతను గుర్తుపట్టి సీమాంధ్ర అధ్యాపకులు వారిని ఉద్దేశ్యపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని టి. అధ్యాపకులు ఆరోపించడం గమనార్హం.
కనుక తమ ప్రాంతానికి చెందిన విద్యార్థుల పేపర్లను తామే దిద్దుతామనీ, వారందరికీ న్యాయం చేస్తామన్న రీతిలో తెలంగాణా అధ్యాపకుల డిమాండ్ ఉన్నది. ఇదిలావుండగా ఓయూలో ఉద్రక్తత పరిస్థితి దృష్ట్యా భారీగా పోలీసులను మొహరించారు.