జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » భారతంలో అభిమన్యుడిలా వైఎస్ జగన్: దానం నాగేందర్ (YS Jagan Mohan Reddy | Danam Nagendar | Odaarpu | AICC)
Bookmark and Share Feedback Print
 
దివంగత నేత వైస్సార్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి భారతంలో అభిమన్యుడిలా ఉందని రాష్ట్ర వైద్యశాఖా మంత్రి దానం నాగేందర్ అన్నారు. పార్టీ నిర్దేశాలను కాదని తానొక్కడే వ్యక్తిగత యాత్రను చేయడంపై మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు.

మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఏఐసీసీ ప్రకటించడంపై చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఏ నాయకుడు మరణించిన సందర్భంలోనూ ఇటువంటి సాయాన్ని అందించలేదన్నారు.

కాగా జగన్ వర్గం మాత్రం ఏఐసీసీ ఆలస్యం చేసినా మంచి నిర్ణయం తీసుకున్నదని అభిప్రాయపడింది. వైఎస్ మరణించిన వెంటనే ఈ పరిహారాన్ని బాధితులకు అందించి ఉన్నట్లయితే మంచి ఫలితాలు వచ్చేవని తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.