జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ గారూ... ఓదార్పు మానుకోవాలి: మంత్రి డొక్కా (Jagan | Odarpu tour | Minister Dokka | AICC | YSR | Regional)
Bookmark and Share Feedback Print
 
కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో తలెపెట్టిన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రకటనపై ఆయన సానుకూలంగా స్పందించాలని కోరారు.

జగన్ ఓదార్పు యాత్రపై ఆయన బుధవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ... జగన్ ఓదార్పు యాత్రను విరమించుకుంటే ఆయనతో పాటు.. పార్టీకి మంచిందన్నారు. వైఎస్ హఠాన్మరణంతో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏఐసీసీ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించిందన్నారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించాలన్నారు.

పార్టీని ధిక్కరించే విధంగా ఆయన నడుచుకోరాదన్నారు. జగన్ మంచి భవిష్యత్ ఉన్న నేతగా మంత్రి అభివర్ణించారు. అందువల్ల ఆయన అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని మంత్రి హితవు పలికారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.