జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీమాంధ్ర అధ్యాపకులపై దాడి కేసులో విద్యార్థుల అరెస్టు! (Seemandhra teachers | Attack case | OU | Hyd | Police | Arrest)
Bookmark and Share Feedback Print
 
ఉస్మానియా విశ్వవిద్యాలయంల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లెక్చరర్లపై జరిగిన దాడి కేసులో వర్శిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను హైదరాబాద్ నగర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలావుండగా, దాడి ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని విశ్వవిద్యాలయ ఉపకులపతి తిరుపతి రావు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విద్యార్థుల అపోహలు తొలగించడానికి సూచనలు చేస్తుందన్నారు. ఈ కమిటీలో నాగేశ్వర్, లక్ష్మయ్య మరో ఇద్దరినిని ఎంపిక చేయాల్సి ఉందన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు.

విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలను మీడియా పెద్దది చేసి చూపుతోందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న వర్శిటీ ప్రాంగణాన్ని మీడియా భగ్గుమనిపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్ వాల్యుయేషన్‌లో విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.