జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మాటతప్పని.. మడమతిప్పని మహానేత వైఎస్: జేసీ (JC Diwakar Reddy | Regional | CLP | YSR | People)
Bookmark and Share Feedback Print
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై సీనియర్ నేత, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మాటతప్పని, మడమతిప్పని మహానేత వైఎస్ అని జేసీ కొనియాడారు, వైఎస్ మొదటి వర్థంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం సీఎల్పీ కార్యాలయంలో వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి పక్కా ప్రణాళికతో అమలు చేశారన్నారు. అందువల్లే ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే మనస్తత్వం వైఎస్‌ సొంతమన్నారు. అందువల్లే ఆయన జన హృదయాల్లో చెరగని ముద్రవేసుకుని శాశ్వితంగా నిలిచి పోయారన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.