ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రజలు తిరగబడితే అధిష్టానం మటాష్: ఎమ్మెల్యే ఆది (People | High command | MLA Adinarayana Reddy | Jammalamadugu | congress)
రాష్ట్ర ప్రజలు తిరగబడితే అధిష్టానం నామరూపాలు లేకుండా పోతుందని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రజాభిమానం ముందు అధిష్టానం కూడా బలాదూరేనని ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందేనన్నారు.
వైఎస్ఆర్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ మృతి చెంది యేడాది గడుస్తున్నా ఆయనపై వున్న అభిమానం నానాటికీ పెరుగుతోందన్నారు.
దీన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. లేనిపక్షంలో ప్రజలతో పాటు.. పార్టీలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని జగన్‌కు తగిన న్యాయం చేయాలన్నారు.