జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్సార్ వర్థంతి: ముఖ్యమంత్రి రోశయ్య కన్నీళ్లు (YS Rajasekhara Reddy | Rosaiah | health | Danam Nagendar | Sabita Indrareddy)
Bookmark and Share Feedback Print
 
WD
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధమ వర్థంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నల్లకాల్వ వద్ద వైఎస్ వర్థంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొనవలసి ఉండగా అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారు.

ఆయన తరపును మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రులు దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి ఆయన వద్దకు వెళ్లారు.

మంత్రులతో రోశయ్య మాట్లాడుతూ... వైఎస్ వర్థంతి వేడుకల్లో పాల్గొనలేక పోయినందుకు ఎంతో బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హఠత్పరిణామంతో మంత్రి దానం సీఎంను ఓదార్చారు. ముఖ్యమంత్రి అనారోగ్యం కారణంగా రేపు జరగాల్సిన పునరంకిత సభను రద్దు చేసుకున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.