ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రోశయ్య కంటే.. వైఎస్ఆర్ వేయి రెట్లు మేలు: చంద్రబాబు (Chandrababu, YSR, Jagan Family, Rosaiha, CM, Kuppam, Regional)
రోశయ్య కంటే.. వైఎస్ఆర్ వేయి రెట్లు మేలు: చంద్రబాబు
ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వేయ్యి రెట్లు మేలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కంటే దివంగత నేత వైఎస్సార్ వెయి రెట్లు మేలన్నారు. రోశయ్య అధికారంలోకి వచ్చాక రాష్ట్రం సమస్యల కొలిమిలో కొట్టుమిట్టాడుతోందన్నారు. వైఎస్ బతికి ఉండివుండే.. రోశయ్య కంటే ఎంతో బాగా పాలన సాగించేవారన్నారు.
వైఎస్ఆర్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే, చంద్రబాబు నాయుడు కూడా తనదైనశైలిలో వైఎస్ఆర్‌ను స్మరించుకున్నారని పలువురు ప్రజలకు అభిప్రాయపడ్డారు.