ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య! (Rosaiah | PCC | Anniversary | Gandhi bhavan | Idupulapaya | Moily)
వైఎస్ వర్థంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య!
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రథమ వర్థంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య పాల్గొన్నారు. వైరల్ ఫీవర్ కారణంగా గత రెండు రోజులుగా అన్ని రకాల అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రోశయ్య.. వైఎస్ వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు.
వైద్యుల సలహా మేరకు ఆయన గాంధీ భవన్‌కు వచ్చారు. ఆయన సీట్లో కూర్చొన్నప్పటికీ బాగా నీరసంగా కనిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1978 నుంచి వైఎస్‌తో వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగతనేత వైఎస్‌ఆర్‌కు కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్పమొయిలీ నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ అధిష్టానం తరపున ఇడుపులపాయ చేరకున్న మొయిలీ వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రియతమ నేతకు అంజలి ఘటించారు. మొయిలీతో పాటు వైఎస్ జగన్, కేవీపీ తదితరులు ఉన్నారు. అనంతరం అక్కడ ఉన్న వైఎస్ఆర్ గెస్ట్‌హౌస్‌లో జగన్, కేవీపీలతో మొయిలీ కొద్దిసేపు చర్చలు జరిపి బెంగుళూరుకు తిరిగి వెళ్లిపోయారు.