ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రాష్ట్రం విడిపోతే భాగ్యనగరంలో మా ప్రాణాలకే ముప్పు (Srikrishna Committee | Hyderabad | Telangana | West Godavari,)
శ్రీకృష్ణ కమిటీ సంప్రదింపుల్లో భాగంగా గురువారంనాడు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో పర్యటించింది. అక్కడి ప్రజల వాదనలను విన్నది. భీమడోలు ప్రజలంతా.. రాష్ట్ర విభజన కూడదని ముక్త కంఠంతో కమిటీకి విన్నవించారు. ఒకవేళ విభజిస్తే రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఉద్యోగాలు చేసుకుంటున్న తమవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు.
ప్రజల అభ్యర్థనలు విన్న అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ... తాము ఇప్పటికే రాష్ట్రంలో చాలా భాగం పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరించామన్నారు. డిసెంబరు 31న రాష్ట్రం కలిసి ఉండాలా...? లేదంటే విడిపోవాలా..? అనే విషయాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరంలకు నివేదిక రూపంలో అందిస్తామని వెల్లడించారు.