రాజశేఖర్ దంపతులకు బెదిరింపులు: చిరు ఫ్యాన్ అరెస్టు!
FILE
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై జీవిత, రాజశేఖర్ దంపతులు తీవ్రంగా ఆరోపణలు చేయడంతో వారిని బెదిరించిన చిరంజీవి అభిమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై జీవితా రాజశేఖర్‌లు విమర్శలు చేయడంతో కోపంతో ఊగిపోయిన చిరు అభిమాని వారిద్దరికి అసభ్య పదజాలంతో బెదిరిస్తూ ఎస్ఎమ్‌ఎస్‌లు పంపాడు. దీంతో జీవిత, రాజశేఖర్ దంపతులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం నల్లవెళ్లి గ్రామానికి చెందిన నాగదుర్గా రంగప్రసాద్ (21) అనే యువకుడిని అరెస్టు చేశారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో రంగప్రసాద్ చిరంజీవికి వీరాభిమాని అని తేలింది. ఇంకా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు కనీసం 20 సార్లు రక్తదానం చేశాడని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.