జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: నటుడు నరేష్ (YS Jagan | Naresh | CM | YSR)
Bookmark and Share Feedback Print
 
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే కడప ఎంపీ వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని నటుడు నరేష్ అన్నారు.

తండ్రి ఆశయాలను తనయుడైన వై.ఎస్. జగన్ నెరవేర్చాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని నరేష్ ఆశించారు. వైఎస్ ఆశయాలను కొనసాగించడానికి జగన్ ముందుకు వస్తున్నారని, జగన్ మిషన్‌ను అందరూ బలపరచాల్సి ఉందని ఆయన చెప్పారు.

పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడ్ని ఎప్పటికీ మరిచిపోలేమని నరేష్ వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సంక్షేమ పథకాలు వైఎస్సార్‌ను చిరకాలం పేదప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయని నరేష్ కొనియాడారు. వైఎస్సార్ మన ముందు భౌతికంగా లేకపోయినా పేదలకు దేవుడిగా ఉంటారని నరేష్ చెప్పారు. ఇడుపులపాయ నవీన దేవాలయంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.