జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అర్హులైన వారికి సంక్షేమ పథకాల ఫలితాలు అందాలి: సీఎం (Y.S. Rajasekara Reddy | K. Rosaiah | Vijayalakshmi | Sonia Gandhi | Manmohan Singh)
Bookmark and Share Feedback Print
 
FILE
సంక్షేమ పథకాల ఫలితాలు అర్హులైన వారికి అందాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఇందుకుగాను ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.

మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తానని సీఎం రోశయ్య అన్నారు. అలాగే 2009లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

కాగా, తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మికి సానుభూతి తెలుపుతూ ముఖ్యమంత్రి రోశయ్య ఆమెకు ఓ లేఖ రాశారు.

మనతో ఆప్యాయంగా ఉన్న వ్యక్తిని కోల్పోయి ఏడాది గడిచినా అప్పటి విషాదంనుంచి అభిమానులు ఇంకా కోలుకోలేదని మీ కుటుంబం ఎంత ఆవేదన చెందుతుందో వూహించగలనని ఆయన ఆ లేఖలో అన్నారు. వీరి కుటుంబాలకు స్వాంతన కలిగించాలని, ప్రశాంత జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుతున్నానని సీఎం తెలిపారు.

తనపై నమ్మకం ఉంచి తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రోశయ్య కృతజ్ఞతలు చెప్పారు. తనకు సహకరించిన మంత్రులకు, శాసనసభ్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.