జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ప్రశాంతంగా సాగుతున్న గ్రూప్-1 పరీక్షలు: ఏపీపీఎస్సీ ఛైర్మన్ (Group-1 exams | APPSC | Hyd | Venkatramireddy | Telangana)
Bookmark and Share Feedback Print
 
గ్రూప్-1 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు సీమాంధ్ర ప్రాంతాల్లో 65 శాంత మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అలాగే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 45 శాతం, తెలంగాణ ప్రాంతంలో 35 శాతం మేరకు అభ్యర్థులు హాజరైనట్టు ఆయన తెలిపారు.

గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో గట్టి పోలీసు భద్రత నడుమ సాగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రాంతాల్లో కొన్నిచెదురు ముదురు సంఘటనలు మినహా పరీక్షలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు.

ఇకపోతే.. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని బీఈడీ కళాశాలలో చోటుచేసుకున్న సంఘటనలపై సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై పూర్తి వివరాలు అందిన తర్వాత స్పందిస్తామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.